కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. జహీరాబాద్ నుంచి ఎర్రగడ్డకు చెరుకు లోడ్‌తో వెళ్తున్న ఈ లారీ.. బీజేపీ కార్యాలయం సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
లారీలో డ్రైవర్ప్రకాశ్కూ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం కారణంగా ఉదయం ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, పోలీసులు క్రేన్ సహాయంతో లారీని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
