సుహాస్ హీరోగా గోపి అచ్చర దర్శకత్వంలో బి నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘హే భగవాన్’. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో టీమ్ అంతా సందడి చేస్తూ.. ఈ మూవీ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలియజేశారు.
ఈ చిత్రంలో శివాని నాగరం హీరోయిన్‌గా నటిస్తుండగా, నరేష్ వికె, సుదర్శన్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాకు ‘రైటర్ పద్మభూషణ్’ ఫేం షణ్ముక ప్రశాంత్ కథను అందించాడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
