
నారాయణపేట: జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తండ్రి కొడుకులు పురుగుల మందు త్రాగి ఆత్మహత్య యత్నం చేశారు. వీరు నారాయాణపేట మండలం శాంసన్ పల్లి గ్రామానికి చెందిన రైతులు నాగప్ప, రాజు గా గుర్తించారు. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగిన వీరు తాము చనిపోతున్నామని.. తమ పొలం సమస్య తీరలేదు కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నామని అక్కడున్న వారికి చెప్పి వరండాలోనే కుప్పకూలిపోయారు. భూ వివాదంలో వీఆర్వో డబ్బులు తీసుకున్నా పనిచేయలేదని.. భూమి సమస్య కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయిందనే మనస్తాపంతో చనిపోతున్నామన్నారు. వీరిని వెంటనే నారాయణపేట ఆసుపత్రికి తరలించారు. పవర్ ఫుల్ పురుగుల మందు తాగడంతో పరిస్థితి విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.