చందానగర్ ,వెలుగు: పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మియాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఓల్డ్ హఫీజ్ పేటలోని సాయినగర్ ప్రాంతానికి చెందిన జి.రమేశ్(20) స్థానికంగా పానీపూరి బండి నడుపుతున్నాడు. తనకు పెళ్లి కావడం లేదని కొన్ని రోజులుగా రమేశ్ బాధపడుతున్నాడు.
గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రమేశ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన కంప్లయిం ట్ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రవికిరణ్ తెలిపారు.
see also: 17 ఏళ్ల అమ్మాయి అనుమానాస్పద మృతి
న్యూడ్ ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని బాలికను బెదిరించి..
సర్పంచ్ గుడ్ జాబ్ : కొలువులకు కేరాఫ్ ప్రేరణ

