ఐదేండ్లలో 3,850 మంది కౌలు రైతుల ఆత్మహత్య

ఐదేండ్లలో 3,850 మంది కౌలు రైతుల ఆత్మహత్య

రైతు స్వరాజ్య వేదిక స్టడీలో వెల్లడి
ప్రభుత్వ సాయం అందక, పంట దిగుబడి రాక బలవన్మరణాలు
 రాష్ట్రంలో అమలుకాని భూఆధీకృత సాగుదారుల చట్టం
కౌలు రైతులకు అందని గుర్తింపు కార్డులు
రైతుబంధు, క్రాప్‌ లోన్స్‌, క్రాప్‌ ఇన్సూరెన్స్‌, ఇతర సబ్సిడీలు
ఏవీ అందుతలేవు ఒడిశా, ఏపీలో కౌలు రైతులకూ ఆర్థిక సాయం
రాష్ర్టంలో కౌలు రైతును అసలు రైతుగానే గుర్తించని ప్రభుత్వం

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేసేది వ్యవసాయమే అయినా వారికి కనీసం రైతులుగా గుర్తింపు లేకుండాపోయింది. వ్యవసాయం చేయకున్నా వేలాది మంది భూయజమానులకు రైతుబంధు, క్రాప్‌ లోన్‌ మంజూరవుతుంటే, భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతులకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రోజుకు సగటున ఇద్దరు అన్నదాతలు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతు స్వరాజ్య వేదిక స్టడీలో వెల్లడైంది.

రైతుబంధు లేదు.. బీమా లేదు

రైతు బీమా అమలు చేయకముందు వయస్సు, భూమితో సంబంధం లేకుండా నిజంగా పంట నష్టపోయిన, అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం వచ్చే అవకాశం ఉండేది. కానీ రైతు బీమా పథకంలో ఉన్న నిబంధనల కారణంగా కౌలు రైతులకు అర్హత లేకుండా పోయింది.
కేవలం పట్టా భూమి కలిగిన 59 ఏళ్లలోపు ఉన్న రైతుకు మాత్ర మే వర్తిం పజేశారు. ఇనాం భూములు, ఇతరుల వద్ద భూములు కౌలుకు
తీసుకుని సాగు చేసే రైతులు, పోడు రైతులు, 60 ఏళ్లుపైబడినవారు పంట నష్టపోయి, అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం వారి కుటుం బాలకు ఎక్స్‌‌గ్రేషియా చెల్లించడం లేదు. ఆర్థిక సాయం అందక బాధిత రైతు కుటుంబాలు ఆగమైపోతున్నాయి.

మరిన్ని వార్తల కోసం