కవితతో కలిపి విచారించండి: కేంద్ర హోం మంత్రికి సుఖేశ్ చంద్ర శేఖర్ లేఖ

కవితతో కలిపి విచారించండి: కేంద్ర హోం మంత్రికి సుఖేశ్ చంద్ర శేఖర్ లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవితతో కలిపి తనను విచారించాలని మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేశ్ చంద్ర శేఖర్ కేంద్రాన్ని కోరారు. కవిత సన్నిహితులు, అర్వింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ తో కూడా కలిపి విచారించాలని రిక్వెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో జోక్యం చేసుకోవాలని శనివారం కేంద్ర హోంశాఖ మంత్రికి మండోలి జైల్ నుంచి సుఖేశ్ చంద్ర శేఖర్ లేఖ రాశాడు. మొత్తం 14 పేజీలతో కూడిన లేఖను అడ్వొకేట్ అనంత్ మాలిక్ ద్వారా సుఖేష్ మీడియాకు రిలీజ్ చేశారు. 

ఇందులో ఎమ్మెల్సీ కవిత, అర్వింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ తో జరిపిన వాట్సాప్ చాట్స్ ను జతపరిచారు. కేజ్రీవాల్, సత్యేందర్ సూచనల మేరకు హైదరాబాద్​లో కవిత సిబ్బంది నుంచి నగదు తీసుకున్నట్లు వెల్లడించారు. కవిత ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం తన మనుషులు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఆఫీసులో ఆ డబ్బును సేకరించినట్లు తెలిపారు. 

కవిత నుంచి తీసుకున్న నగదును ఢిల్లీ, గోవాకి తాను తరలించినట్లు వివరించారు. డబ్బుని నెయ్యిగా కోట్ చేస్తూ కవితతో చాటింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఒక్కో టిన్ కోటి రూపాయలకు సమానమని.. కవిత, సత్యేందర్ జైన్, అర్వింద్ కేజ్రీవాల్ మధ్య సంబంధాన్ని ఈ చాట్స్ నిర్ధారిస్తాయని వివరించారు. ప్రస్తుతం కొన్ని చాట్స్ ను మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. 

కేజ్రీవాల్, సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియా, కైలాశ్ ఘెలోట్, కవిత నేతృత్వంలోని ఆప్ సిండికేట్​కు సంబంధించి తన వద్ద ఉన్న సాక్ష్యాలతో కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872 ప్రకారం.. సర్టిఫికెట్ అండర్ సెక్షన్ 65 బీ కింద వాట్సాప్ చాట్​లను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర హోం శాఖను సుఖేశ్ విజ్ఞప్తి చేశారు.