కేటీఆర్ లీగల్ నోటీసుకు సుఖేశ్ చంద్ర శేఖర్ రిప్లే

కేటీఆర్ లీగల్ నోటీసుకు సుఖేశ్ చంద్ర శేఖర్ రిప్లే

న్యూఢిల్లీ, వెలుగు: తాను చేసిన ఆరోపణలపై సీబీఐ ఎంక్వయిరీకి అంగీకరించే దమ్ముందా ? అని మంత్రి కేటీఆర్ కు మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ సవాల్ విసిరారు. గురువారం ఆయన ఇటీవల కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులపై స్పందిస్తూ.. మూడు పేజీల లెటర్ ను రిలీజే చేశారు. రెండ్రోజుల క్రితం కేటీఆర్ లీగల్ నోటీసు అందిందని..ఇలాంటి వాటికి తగ్గేదేలే( సుఖేశ్ జుకేగ నహీ) అని సుఖేశ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నోటీసు పంపేముందు కేటీఆర్ సరైన న్యాయ సలహాలు తీసుకోవాల్సిందని సూచించారు. 

భారత న్యాయ వ్యవస్థ కేటీఆర్  వ్యూహాలన్నింటి కంటే బలమైందన్నారు. కేటీఆర్ అహంకారం తన దగ్గర పని చేయదని తెలిపారు. ‘మీపై, కవితపై గవర్నర్, సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేసిన తర్వాత బెదిరింపులు కాకుండా లీగల్ నోటీసు పంపారు. నా ఫిర్యాదుపై కేటీఆర్ గగ్గోలు పెడుతున్నారు. నా ఆరోపణల్లో నిజం లేకపోతే కేటీఆర్ సీబీఐ ఎంక్వయిరీని స్వాగతించాలి.  నావి ఆరోపణలైతే దర్యాప్తు తప్పనిసరిగా ఎదుర్కోవాలి. నాపై ఉన్న ఏ కేసులోనూ నేను దోషిగా తేలలేదు.’ అని 12 పాయింట్లతో సుఖేశ్ చంద్ర శేఖర్ లేఖ రాశారు.