బషీర్ బాగ్, వెలుగు: ఇంట్లో భార్యను పెట్టుకొని, మైనర్ ను వివాహం చేసుకున్న యువకుడిని సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాసచారి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కట్టంగూర్కు చెందిన హరికృష్ణ(27) సెంట్రింగ్ పనిచేస్తుంటాడు. ఇతనికి మూడేండ్ల కింద వివాహమైంది. స్థానికంగా ఉండే బాలిక మేడ్చల్‌లోని ఓ ఇంజనీరింగ్కాలేజీలో బీటెక్ఫస్ట్ఇయర్చదువుతోంది. కొన్ని నెలల కింద ఆమెను పరిచయం చేసుకున్న హరికృష్ణ, ప్రేమిస్తున్నట్లు నమ్మబలికాడు. ఈ నెల 11న స్నేహితులతో కోఠిలోని రెస్టారెంట్‌కు వెళ్లిన బాలికను హరికృష్ణ కలిశాడు.
అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లాడు. అదే రోజు తమ కూతురు కనిపించడం లేదని పాప తండ్రి సుల్తాన్బజార్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే హరికృష్ణ ఈ నెల 22న బాలికను పెండ్లి చేసుకున్నాడు. తర్వాత స్వగ్రామానికి తీసుకెళ్లగా, పాప మైనర్ అని తెలిసింది. భయంతో హరికృష్ణ ఆమెను వదిలి పరారయ్యాడు. అయితే తాను మేజర్ ను అంటూ బాలిక సుల్తాన్ బజార్ పోలీసులను ఆశ్రయించింది. ప్రూఫ్కింద టెన్త్క్లాన్సర్టిఫికెట్ను చూపించింది. అందులో డేట్ఆఫ్బర్త్తప్పుగా పడిందని బాలిక తల్లి పోలీసులకు వివరించింది.
పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలోని వివరాల ఆధారంగా పాప మైనర్‌అని తేలింది. పోలీసులు బాలికను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్ హోమ్ కు తరలించారు. హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కిడ్నాప్, పొక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి , రిమాండుకు తరలించినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు.
