జొహార్ బహ్రు (మలేసియా) : సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్‌లో ఇండియా జూనియర్ మెన్స్ హాకీ జట్టు వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 6–4తో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించింది. మహ్మద్ కొనైన్ దాడ్ ఏడో నిమిషంలో తొలి గోల్ అందించగా..
ధీరజ్ (17, 50వ ని.), శర్దా నంద్ (20, 50వ ని) డబుల్ గోల్స్‌తో సత్తా చాటారు. మన్మీత్ (26వ ని) ఓ గోల్ కొట్టాడు. బ్రిటన్ తరఫున రోరి పెన్సోస్ (2, 15వ ని), మైకేల్ రాయ్‌డెన్ (46, 59వ ని) రెండేసి గోల్స్ సాధించారు.