ఖుషీ మూవీలో.. అదిరిపోయే బైక్ స్టంట్: ఖుషి టీం

ఖుషీ మూవీలో.. అదిరిపోయే బైక్ స్టంట్:  ఖుషి టీం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ(Khushi). ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఖుషి సినిమా థియేటర్లలో 2023 సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీం ప్రొమోషన్స్లో జోరు పెంచింది. లేటెస్ట్ గా యాంకర్ సుమ..రాజీవ్ కనకాలతో ఖుషి టీం ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. 

ఖుషి మేకర్స్ ఇప్పటి వరకు ఫీల్ గుడ్ సాంగ్స్, లవ్,ప్యామిలీ ఎంటర్టైన్ మెంట్ ఇవన్నీ ట్రైలర్,టీజర్స్ లో చూపించారు. ఇక ఈ మూవీ ఫస్ట్ అఫ్లో.. ఒక బైక్ స్టంట్స్తో కూడిన ఓ యాక్షన్ ఫైట్ ఉంటుందని..ఫారెస్ట్లో జరిగే ఈ ఫైట్ని ఫైట్ మాస్టర్  పీటర్ హెయిన్స్ చాలా ఇంట్రెసింగ్గా డిజైన్ చేసినట్లు తెలిపారు. అలాగే ఈ బైక్ సీక్వెన్స్ నీళ్ల మీద కూడా ఉంటుందని మూవీ టీం పేర్కోన్నారు. దీంతో మాస్ ఆడియన్స్కు కూడా కావాల్సిన యాక్షన్ పార్ట్ ఉండటంతో విజయ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఇప్పటికే ట్రైలర్లో మెట్రోలో వచ్చే ఫైట్ను చూపించారు. ఖుషి స్టోరీని కాస్తా లీక్ చేసిన పెద్ద రేంజ్లో వైరల్ అవుతుంది. దీంతో మూవీ టీం..ప్రొమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 

ఇక ఖుషి మూవీ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్(Hesham abdul wahab)  హృదయాలను హత్తుకునేలా సాంగ్స్ కంపోజ్ చేశారు. ఖుషి మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ సినిమాలు తీసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.ఇక ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.