ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అంటూ వస్తున్న గోదారి గట్టుపైన హీరో..

ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అంటూ వస్తున్న గోదారి గట్టుపైన హీరో..

ఇటీవల ‘గోదారి గట్టుపైన’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చిన   సుమంత్ ప్రభాస్.. తన నెక్స్ట్ మూవీని ప్రకటించాడు.  వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం  వహిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో  భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై   ప్రణయ్  రెడ్డి వంగా నిర్మిస్తున్నారు.  శుక్రవారం ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ  టైటిల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  

ఈ చిత్రానికి ‘రోమాంచకం’ అనే డిఫరెంట్ టైటిల్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు. ఇక ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మనసుకు హత్తుకునే  ఫీల్‌‌‌‌‌‌‌‌తో యూత్ ఫుల్ వైబ్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంటోంది.   ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ’  అనే ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రంలో  సుమంత్ ప్రభాస్‌‌‌‌‌‌‌‌కు జోడీగా అనంతిక సనీల్ కుమార్ నటిస్తోంది. 

ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పవన్ పప్పుల సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించగా, వాసుకి వైభవ్ సంగీతం అందిస్తున్నాడు.  లవ్, ఫన్, బ్యూటిఫుల్ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో  ఒక ఫ్రెష్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ  చిత్రం  తెరకెక్కనుందని మేకర్స్ తెలియజేశారు.  త్వరలో  మరిన్ని అప్డేట్స్ మేకర్స్ వెల్లడించనున్నారు.