హైదరాబాద్, వెలుగు: దేశంలోని రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ నార్–ఇండియా, తాజాగా తమ కొత్త జాతీయ నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. సుమంత్ రెడ్డి చైర్మన్‌గా, చంద్రేష్ విఠలాని ప్రెసిడెంట్‌గా, ఆశిష్ మెహతా ప్రెసిడెంట్-ఎలెక్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. వైస్ చైర్మన్, సీఈఓ, సెక్రటరీ వంటి ఇతర పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి.
‘వన్ ఇండియా, వన్ లైసెన్స్’, రెరా ఫ్రేమ్‌వర్క్‌తో బలపడడం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అభివృద్ధి, విద్యా–నైపుణ్య విస్తరణపై దృష్టి పెడతామని ఈ బృందం పేర్కొంది. ముంబైలో జరిగిన వార్షిక కన్వెన్షన్‌లో కొత్త బృందాన్ని నార్–ఇండియా సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కన్వెన్షన్‌లో రూ.3 వేల కోట్లకు పైగా వ్యాపార ఒప్పందాలు కుదిరాయని సంస్థ ప్రకటించింది.
ఇండియాలో ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ ప్రభావం మరింత బలపడిందని తెలిపింది. ఈ యాన్యువల్ కన్వెన్షన్‌లో సుమారు 1,800 మందికి పైగా డెలిగేట్లు పాల్గొన్నారని, నివాస, వాణిజ్య, రిటైల్ రంగాల్లోని ప్రాజెక్ట్‌లను ప్రదర్శనకు ఉంచారని, రిలయన్స్, టాటా, బిర్లా వంటి పెద్ద సంస్థలు కూడా అవకాశాలను పరిశీలించాయని వివరించింది.
