సమ్మర్​ కోచింగ్ క్యాంపులు వచ్చేస్తున్నయ్..

సమ్మర్​ కోచింగ్ క్యాంపులు వచ్చేస్తున్నయ్..

ఏప్రిల్​ 25 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో షురూ

హైదరాబాద్, వెలుగు: సమ్మర్​కోచింగ్​క్యాంపుల నిర్వహణకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్​25 నుంచి క్యాంపులు ప్రారంభించాలని ప్లాన్​చేస్తోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా 44 రకాల క్రీడల్లో శిక్షణ ఇవ్వనుంది. ఏప్రిల్​మొదటి వారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఆసక్తిగలవారు https://sports.ghmc.gov.in/ వెబ్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్టర్​అయిన 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు పిల్లలకు గ్రేటర్​పరిధిలోని వివిధ ప్లే గ్రౌండ్లలో శిక్షణ ఇవ్వనున్నారు. గతేడాది బల్దియా సమ్మర్​క్యాంపులకు మంచి స్పందన వచ్చింది. దాదాపు లక్షమంది శిక్షణ పొందారు. ఈసారి ఆ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్​అమల్లో ఉన్నందున అధికారులు మాత్రమే కోచింగ్ క్యాంపులను ప్రారంభిస్తారు. సమ్మర్ క్యాంపుల్లో అథ్లెటిక్స్, ఆర్చరీ, బాల్ బాడ్మింటన్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, కార్ఫ్ బాల్, మాల్ కంబా, నెట్ బాల్, రోలార్ స్కేటింగ్, సాఫ్ట్ బాల్, స్విమ్మింగ్, సెపక్ తక్రా, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టెన్నికాయిట్, థైక్వాండో, టగ్​ఆఫ్​వార్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్​ఇండియన్, రెజ్లింగ్ రోమన్, ఉషు, యోగా, త్రో బాల్, కిక్ బాక్సింగ్, మయ్ థాయ్, స్కే మార్షల్ ఆర్ట్స్, మినీ ఫుట్ బాల్, క్యారమ్స్ పై కోచింగ్ ఇవ్వనున్నారు.