నీళ్ల తిప్పలు : బుక్ చేసినా..3 రోజులు ఆగాల్సిందే!

నీళ్ల తిప్పలు : బుక్ చేసినా..3 రోజులు ఆగాల్సిందే!

హైదరాబాద్, వెలుగు: నగరంలో నీటి వినియోగం విపరీతంగా పెరుగుతోంది. వాటర్ బోర్డులో నీటి కొరత ఏర్పడటంతో పలు కాలనీలతో పాటు శివారు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చే రిజర్వాయర్లలో నీటి నిల్వలు పడిపోతుండటం, భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో రానున్న రోజుల్లో మంచినీటి ఇబ్బందులు తప్పేటట్లు లేవని జనాలు ఆందోళన చెందుతున్నారు. సిటీకి రోజూ కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు నుంచి మొత్తం 483 ఎంజీడీల మంచినీరు సరఫరా అవుతోంది. కొంతకాలంగా సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటిమట్టం విపరీతంగా పడిపోతోంది. దీంతో స్థానిక వినియోగం కోసం వాటి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గోదావరి, కృష్ణా జలాలు నగరానికి ప్రధాన నీటి వనరులుగా మారాయి. మంజీరా, సింగూరు నుంచి ఏర్పడిన 50 ఎంజీడీల కొరతను అధిగమించేలా మరో 30 ఎంజీడీలను గోదావరి నుంచి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలశయాల నుం చి 15 ఎంజీడీల నీటిని వాటర్ బోర్డు సేకరిస్తుంది. వీటిని శుద్ధిచేసిన తర్వాత నగరానికి ట్యాంకర్లు, పైపులైన్ల ద్వారా పంపిణీ చేస్తుంది. జలమండలి లెక్కల ప్రకారం 5 ఎంజీడీల లోటుతో గ్రేటర్ పరిధిలో

రాజేంద్ర నగర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లా పూర్, అల్వాల్ తోపాటు, ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే సిటీలో పలు ప్రాంతాల్లో డే బై డే సరఫరా చేస్తుండగా, మరికొన్ని చోట్ల మూడు రోజులకోసారి నీరందుతున్న కాలనీలు ఉన్నాయి. చాలా చోట్ల లో ప్రెషర్ కారణంగా నీటి సరఫరా జరుగుతున్నా .. 20 నిమిషా లకు మించి సరఫరా అవడం లేదని జనాలు ఆవేదన చెందుతున్నారు. వేసవి కాలంలో నీటి వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో నగర వాసులకు నీటి తిప్పలు తప్పడంలేదు. యాక్షన్ ప్లా న్ అమలవుతున్నా.. వేసవిని దృష్టిలో ఉంచుకుని జలమండలి ఎండీ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని అధికారులకు సూచించారు. 5 ఎంజీడీల నీటి కొరతను తట్టుకునేలా గోదావరి, హిమాయత్ సాగర్ , ఉస్మాన్ సాగర్ నీటిని తరలిం చి శుద్ధిచేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, దీనికి అనుగుణంగా అదనంగా 20 ఫిల్లింగ్ స్టే షన్లు, 100 ఉచిత వాటర్ ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.

అయితే ఇప్పటివరకు 13 ఫిల్లింగ్ స్టేషన్లు, 70 వాటర్ ట్యాంకర్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి . వీటిని నీటి ఎద్దడి విపరీతంగా ఉన్న ప్రాంతాల్లో తొలుత ఏర్పాటు చేసి, మిగతా ఫిల్లింగ్ స్టేషన్లను డిమాండ్ ఉన్న ప్రాంతాలలో ఏర్పాటు చేసే యోచనలో జలమండలి ఉంది. పూర్తి స్థాయిలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు కాకపోవడంతో పలు కాలనీ వాసులు నీటి కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. సాం కేతిక సమస్యల కారణంగా ఎదురయ్యే లో ప్రెషర్ తో నీటి సరఫరా సరిగ్గా లేదనీపలు కాలనీలవాసులు చెబుతున్నారు. వాటర్ షార్టేజ్ కారణంగా నీటి సరఫరా లేని ప్రాంతాలకు వాటర్ బోర్డు ఉచిత వాటర్ ట్యాంకర్లతో అందిస్తుంది.

ఎదురు చూపులే..

వాస్తవానికి పైపు లైన్లు లేని ప్రాంతాలకు జలమండలి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తుంది. సిటీలో ప్రస్తుతం పెయిడ్, ఉచిత ట్యాంకర్లన్నీ కలిపి 1,100 వరకు అందుబాటులో ఉండగా, మరో 100 ట్యాంకర్లను పెంచి ఉచితంగా నీటిని అందిం చాలని ప్లాన్ చేసుకుంది. స్థానికంగా ఉన్న లోపాలు, అవకతవకల కారణంగా అనుకున్న తీరుగా ఉచిత ట్యాంకర్లు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు చేరడంలేదనే విమర్శలు ఉన్నాయి. కనీసం జలమండలి అందించే పెయిడ్ ట్యాంకర్లను బుక్ చేసుకుందామంటే పెరిగిన నీటి వినియోగంతో బుక్ చేసుకున్న 3 నుంచి 5 రోజుల వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతి డివిజన్ పరిధిలో బుకింగ్ వెయిటింగ్ లిస్టు రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతుంది. అందుబాటులోకి రాని ఫిల్లింగ్ స్టేషన్ల కారణంగా అనుకున్నంత స్థాయిలో వాటర్ ట్యాంకర్లు దొరకడం లేదు. అయితే ప్రైవేటు ట్యాంకర్ల కాం ట్రాక్టును మూడు నెలల నుం చి 6 నెలలకు పెంచేలా అధికారులు చర్యలు తీసుకున్నా ఇప్పటివరకు యజమానులు జలమండలికి నీటిని సరఫరా చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ అసలే వేసవి. జలమండలి అందించే వాటర్ ట్యాంకర్లు అందుబాటులో లేవు. దీంతో ప్రైవేటు ట్యాంకర్ల ఆపరేటర్లు దోపిడీకి దిగుతున్నారు. వాస్తవానికి జలమండలి అందించే పెయిడ్ ట్యాంకర్లకు 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్ కు రూ.500 వసూలు చేస్తుం డగా, కమర్షియల్ కేటగిరీ ట్యాంకర్లకు రూ.800 వసూలు చేస్తుంది. అయితే స్థా నికంగా వాటర్ బోర్డు ట్యాంకర్లు అందుబాటులో లేకపోవడంతో చాలామంది ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నా రు. ఇదే అదనుగా అధిక ధరలకు విక్రయిస్తూ ట్యాంకర్ ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు. 5 వేల లీటర్ల ట్యాంకర్లకు రూ.1000–1500 వసూలు చేస్తుండగా, కమర్షియల్ కేటగిరీలో దొరికే 10 వేల లీటర్ల ట్యాంకర్ కు కనీసం రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ట్యాంకర్లు విధిగా జలమండలిలో నమోదు చేసుకోవాలని, సూచించిన ధరలకే నీటిని సరఫరా చేయాలనే నిబంధన ఉంది. ఇప్పటివరకు జలమండలిలో నమోదు చేసుకున్న ట్యాంకర్ల సంఖ్య 60కి మించలేదని చెబుతున్నాయి అధికార వర్గాలు.