ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడిగాలుల నుంచి తట్టుకునేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ఎండల తీవ్రతకు ఏసీలు, కూలర్లు పనిచేయడం లేదు. దీంతో ఇండ్లు, వ్యాపార సముదాయాల ముందు పచ్చని పరదాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు చిరు వ్యాపారులు తమ బైక్లను కాపాడుకునేందుకు గోనె సంచులు, బెడ్ షీట్లు కప్పుతున్నారు. చికెన్ వ్యాపారులు గంటకోసారి బాయిలర్ కోళ్లకు నీళ్లు చల్లుతూ ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తున్నారు.
