గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. చల్లటి నీటి కోసం జనం మట్టి కుండలు వాడుతున్నారు. శివారు ప్రాంతాల నుంచి తాటి ముంజలు వస్తున్నాయి. ఏడాదికోసారి దొరికే ముంజలను జనం ఇష్టంగా కొనుక్కుని తింటున్నారు.
- ఫొటోగ్రాఫర్, వెలుగు