Sundaram Master OTT: OTTకి సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sundaram Master OTT: OTTకి సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ కమెడియన్, నటుడు వైవా హర్ష(Viva Harsha) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ సుందరం మాస్టర్(Sundaram Mastar). మాస్ మహారాజ్ రవితేజ(RaviTeja) నిర్మాతగా వచ్చిన ఈ సినిమాను కల్యాణ్ సంతోష్(Kalyan Santosh) తెరకెక్కించారు. కామెడీ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో దివ్య శ్రీపాద హీరోయిన్ గా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుండి కూడా మంచి రివ్యూస్ అందుకున్న ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. 

దాదాపు సుందరం మాస్టర్ సినిమా విడుదలై నెలరోజులు గడుస్తన్న సందర్బంగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్న ఆహా సంస్థ మార్చ్ 28 నుండి స్ట్రీమింగ్ చేయనుంది. ఇదే విషయాన్ని ట్విట్టర్ వైదికగా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఆడియన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.