Omi Bhau: మోస్ట్ వైలెంట్ ఓమీ బావ్.. ఓజీ నుండి ఇమ్రాన్ ఫస్ట్ లుక్

Omi Bhau: మోస్ట్ వైలెంట్ ఓమీ బావ్.. ఓజీ నుండి ఇమ్రాన్ ఫస్ట్ లుక్

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ(OG). స్టైలీష్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో, మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. కెరీర్ లో ఫస్ట్ టైం గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ కనిపిస్తుండటంతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నాం అని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మీ విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి ఇమ్రాన్ హస్మీ  ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. నేడు(మార్చ్ 24) ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు సందర్బంగా OG నుండి ఆయన పోస్టర్ రిలీజ్ చేసారు. ఓమి భాయ్ గా ఇమ్రాన్ ఫస్ట్ లోక్ చాలా పవర్ ఫుల్ అండ్ వైలెంట్ గా ఉంది. చాలా సీరియస్ గా సిగరెట్ వెలిగిస్తూ ఉన్న ఇమ్రాన్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మొన్నటివరకు రొమాంటిక్ హీరోగా కనిపించిన ఇమ్రాన్ హష్మీ.. ఓజీలో విలన్ గా కనిపించి ఆడియన్స్ కు షాకిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ చూసిన ఆయన అభిమానులు, పవన్ అభిమానులు, నెటిజన్లు ఇమ్రాన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈ సినిమాతో ఇమ్రాన్ ఎలాంటి విజయాన్ని అందుకోనున్నాడో చూడాలి.