సునీల్‌కు బ్రాంజ్.. రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి పతకం!

సునీల్‌కు బ్రాంజ్.. రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి పతకం!

రెజ్లింగ్‌‌‌‌లో సునీల్‌‌‌‌ కాంస్యం గెలిచాడు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌ 87 కేజీల బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ బౌట్‌‌‌‌లో సునీల్‌‌‌‌ 9-0తో రాబర్ట్‌‌‌‌ జాన్‌‌‌‌స్టన్‌‌‌‌ (ఫిలిప్పీన్స్‌‌‌‌)పై గెలిచాడు. దీంతో గ్రీకో రోమన్‌‌‌‌లో పతకం సాధించిన తొలి ఇండియన్‌‌‌‌ రెజ్లర్‌‌‌‌గా ఘనత సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌‌‌‌లో సునీల్‌‌‌‌ టెక్నికల్‌‌‌‌ సుపీరియారిటీతో తైజో యోషిడా చేతిలో ఓడాడు. తొలి పీరియడ్‌‌‌‌ తర్వాత యోషిదా 6-0 ఆధిక్యంలో నిలిచి సునీల్‌‌‌‌కు స్కోరింగ్‌‌‌‌ చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. ఆ వెంటనే మరో ఐదు పాయింట్లు జోడించి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ బౌట్‌‌‌‌కు అర్హత సాధించాడు. 

విమెన్స్‌‌‌‌ 68 కేజీల్లో 1/8 రౌండ్‌‌‌‌లో నిషా...  పాక్‌‌‌‌ (ఉత్తర కొరియా) చేతిలో ఓటమిపాలైంది. స్టార్టింగ్‌‌‌‌లో నిషా 2-0 ఆధిక్యంలోకి వెళ్లగా, పాక్ నాలుగు పాయింట్లు సాధించి మొదటి పీరియడ్‌‌‌‌ను 4-2 ఆధిక్యంతో ముగించింది. రెండో పీరియడ్‌‌‌‌లో నిషా రెండు పాయింట్లు సాధించి మ్యాచ్‌‌‌‌ను సమం చేసింది. ఆ తర్వాత ఏ రెజ్లర్ కూడా పాయింట్ సాధించలేదు. రెప్‌‌‌‌చేజ్‌‌‌‌  రౌండ్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ రెజ్లర్‌‌‌‌.. సౌత్‌‌‌‌ కొరియాకు చెందిన పార్క్ హ్యోనియోంగ్‌‌‌‌ చేతిలో 'బై ఫాల్' ద్వారా ఓడిపోయింది.