నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వండి : సునీతా రావు

నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వండి : సునీతా రావు

హైదరాబాద్, వెలుగు :  నామినేటెడ్​ పదవుల్లో మహిళా నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు కోరారు. మంగళవారం గాంధీభవన్​లో మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జాతీయ మహిళా కాంగ్రెస్ జనరల్​ సెక్రటరీ హసీనాల ఆధ్వర్యంలో ఈ మీటింగ్​ జరిగింది.

ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్​జిల్లా కమిటీలు, బ్లాక్ కమిటీలు, డివిజన్, మండల, పట్టణ, వార్డ్​ కమిటీల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని సునీతారావు కోరారు. నామినేటెడ్ పదవులకు సంబంధించి కాంగ్రెస్ మహిళా నేతల నుంచి దరఖాస్తులు, బయోడేటాను తీసుకున్న సునీతా రావు.. ఆ వివరాలను మహేశ్ కుమార్​గౌడ్​కు అందజేశారు. తమ విజ్ఞప్తిని సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.