
మెదక్ (శివ్వంపేట), వెలుగు: నా సొంతూర్లో ప్రోగ్రాం గురించి నాకు సమాచారం ఇవ్వరా? అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితారెడ్డి ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శివ్వంపేట మండలం గోమారంలో శనివారం రైతు వేదిక ఓపెనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి సునితారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సునితారెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం గురించి ఆఫీసర్లు ఎవరూ తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి చెబితే వచ్చానన్నారు.
అంతేగాక సభా వేదిక మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లో తన ఫొటో లేదని తహసీల్దార్ శ్రీనివాస్ చారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించని తహసీల్దార్ పై చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ చేస్తానన్నారు.