
ఖైరతాబాద్, వెలుగు: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సుంకరి ఇస్సాదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కా హరీశ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే కేటీఆర్నియోజకవర్గమైన సిరిసిల్లలో పోటీ చేస్తామని చెప్పారు. అక్కడ తమకు 21,552 ఓట్లు ఉన్నాయని, గెలిచే అభ్యర్థిని ఓడించడానికి ఇవి చాలని వివరించారు.
ఇస్సాదారుల జీవన మనుగడను పక్కన పెట్టి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 81, 85లను వెంటనే రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలోని 50 స్థానాల్లో తాము పోటీలో ఉంటామని నక్కా హరీశ్ చెప్పారు. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు జంగం నరేశ్, ప్రధాన కార్యదర్శి వర్ల సంపత్కుమార్తదితరులు పాల్గొన్నారు.