
కరోనా మహమ్మారి తీవ్రత తగ్గడం లేదు. సామాన్యల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల వరకు ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడగా..కొందరు ప్రాణాలు కోల్పోయారు. లేటెస్ట్ గా బాలీవుడ్ యాక్టర్ , గురుదాస్ పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ (64)కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవలే సన్నీ డియోల్ కు భుజానికి శస్త్ర చికత్స జరిగింది. అప్పటి నుంచి కుల్లు జిల్లాలోని మనాలిలో తన ఫాంహౌస్ లో ఉంటున్నారు. తన స్నేహితులతో కలిసి తిరిగి ముంబై వెళ్లాలనుకున్నారు. ఈ లోపే టెస్టులు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని హిమాచల్ ప్రదేశ్ హెల్త్ సెక్రటరీ అమితాబ్ అవస్థీ తెలిపారు.