
తాను పోర్న్ వీడియోల్లో నటించడం వల్ల తన తల్లి మానసికంగా కుంగిపోయిందని బాలీవుడ్ నటి సన్నీలియోన్(Sunny leone) ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తన తల్లికి మద్యం అలవాటు ఉండేదని పేర్కొంది. తనకు అది వ్యసనంగా మారడానికి మాత్రం తాను పరోక్షంగా కారణమైనట్టు తెలిపింది.
‘నేను అమెరికాలో ఉన్నప్పుడు పోర్న్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అప్పటికే మా అమ్మకు తాగే అలవాటు ఉండేది. నేను ఎంచుకున్న వృత్తి ఆమెను మరింత కుంగదీసింది. ఓ విధంగా ఆమె ఆల్కహాల్‌కు బానిస కావడానికి నేను కూడా ఓ కారణమే. మా ఇంట్లో రోజూ గొడవలు జరుగుతుండేవి. ఈ కారణంగా నాతో పాటు మా సోదరుడు, నాన్న ఎంతో ఇబ్బందిపడేవారం. ఆమెకున్నది ఒక మానసిక సమస్య అని తర్వాత గుర్తించాం’ అని సన్నీలియోన్ తెలిపింది. డానియల్ వెబర్(Daniel Weber)ను పెళ్లి చేసుకున్న సన్నీ ప్రస్తుతం బాలీవుడ్లో సెటిలైంది.