సౌతాఫ్రికా 20 లీగ్ విజేత సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్

సౌతాఫ్రికా 20 లీగ్ విజేత సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్

సౌతాఫ్రికా 20 లీగ్ ఫస్ట్ సీజన్ విజేతగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన ప్రిటోరియా క్యాపిటల్స్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. 

ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌట్ అయింది. కుశాల్ మెండీస్(21), రిలీ రోసౌ(19), జేమ్స్ నీషమ్(19) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో వాన్‌డెర్ మెర్వే 4 వికెట్లు తీసుకున్నాడు. సిసండా మగల, బార్టమాన్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. మార్కో జాన్సెన్, ఎయిడెన్ మార్క్‌రమ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఆ తర్వాత 136 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన  సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 16.2 ఓవర్లలోనే 137 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఆడమ్ రోసింగ్టన్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57 పరుగులు చేశాడు. కెప్టెన్ మార్క్‌రమ్(26), జోర్డాన్ హెర్మాన్(22) పరుగులతో రాణించారు. చివర్లో  మార్కో జాన్సెన్ 13 నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. క్యాపిటల్స్ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈథన్ బోచ్, ఆదిల్ రషీద్, కొలిని్ ఇంగ్రామ్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ దక్కించుకున్నారు.  ఈ టోర్నీ‌లో 366 పరుగులు 11 వికెట్లతో రాణించిన మార్క్‌రమ్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.