సన్ రైజర్స్ ఓడె.. ఫ్యాన్స్ బాధపడె

సన్ రైజర్స్ ఓడె.. ఫ్యాన్స్ బాధపడె

 

  •  అభి, హెడ్, కిషన్​ మెరుపుల్లేవ్​  
  •  ఫస్ట్​ మ్యాచ్​లో ఓటమితో నిరుత్సాహం

ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన పోరులో సన్‌‌‌‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో ఫ్యాన్స్​నిరుత్సాహానికి గురయ్యారు. చాలా రోజుల తర్వాత తమ అభిమాన జట్టు ఆటను ఆస్వాదించాలని ఉప్పల్‌‌‌‌కు పోటెత్తిన అభిమానులకు నిరాశ తప్పలేదు. మహామహులుగా పేరున్న అభిషేక్​శర్మ, హెడ్,  ఇషాన్ కిషన్ వచ్చినట్టే వచ్చి పెవిలియన్​ చేరడంతో అసంతృప్తికి గురయ్యారు.

క్లాసెస్, నితీష్​కుమార్​రెడ్డి ఏడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లు బాది 156 పరుగులకు చేర్చడంతో కాస్త సంతృప్తి చెందారు. చివరకు, లక్నో జట్టు మ్యాచ్​గెలవడంతో దిగాలుగా ఇంటిబాట పట్టారు.