Vastu Tips : ఇంట్లో అటకలు ఏ దిక్కులో ఉండాలి.. ఆ రెండు గదుల మధ్య డోర్ పెట్టుకోవచ్చా..?

Vastu Tips : ఇంట్లో అటకలు ఏ దిక్కులో ఉండాలి.. ఆ రెండు గదుల మధ్య డోర్ పెట్టుకోవచ్చా..?

ప్రతి ఇంట్లో ఉపయోగించని వస్తువులు.. లేదా ఏడాదికొక్కసారి ఉపయోగించే వస్తువులు భద్రపర్చుకొనేందుకు  సన్​ షైడ్స్​ ( అటకలు) కట్టుకుంటారు.  ఇల్లు మొత్తం  వాస్తు ప్రకారం నిర్మించి.. ఇవి  ఎక్కడ పడితే ఎక్కడ ఉంటే ఇబ్బందులు వస్తాయని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ అంటున్నారు.  ఇంట్లో అటకలు ఏ దిక్కులో ఉండాలి.. రెండు గదుల మధ్య డోర్​ లేకపోతే నష్టాలు కలుగుతాయా...  మొదలగు వాస్తు సందేహాల గురించి ఆయన ఏమంటున్నారో చూద్దాం. . .

 ప్రశ్న: మా కిచెన్​  లో అటకలు తూర్పు, దక్షిణం వైపు ఉన్నాయి. బెడ్ రూమ్​ లో  పడమర, తూర్పు దిక్కుల్లో ఉన్నాయి. ఒక సిద్ధాంతి నైరుతిలో అటక ఉండకూడదని చెప్పారు. అటకలు ఏఏ గదుల్లో, ఏఏ దిక్కుల్లో కట్టుకోవాలి?

జవాబు:  మీ కిచెన్, బెడ్రూంలో అటకలు తూర్పుదిక్కులో ఉన్నాయి. మంచిది కాదు. వాటిని తొలగించండి. నైరుతిలో ఉండడం వల్ల ఎలాంటి దోషం లేదు. ఏ గదిలో అయినా అటకలు తూర్పు, ఉత్తరం దిక్కుల్లో పెట్టుకోవడం మంచిది కాదు. దక్షిణం, పడమర దిక్కుల్లో మాత్రమే కట్టుకోవాలి

 రెండు గదుల మధ్య డోర్ ఉండొచ్చా..

 ప్రశ్న: మాది తూర్పు వాకిలి ఇల్లు. ఆగ్నేయంలో ఉన్న వంటగదిని ఆనుకొని మరోగది కట్టాం. ఆ రెండింటికీ మధ్యలో డోర్ పెట్టొచ్చా? గదుల్లో మార్పులేమైనా చేయాలా?.

జవాబు: ఆగ్నేయంలో వంటగది ఉండటం మంచిదే. రెండు గదులను కలుపుతూ మధ్యలో డోర్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. కొత్తగా కట్టిన రూము వాయువ్యంలో డోర్ వచ్చేలా చూసుకోండి. మంచి ఫలితం ఉంటుందని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ అంటున్నారు.