ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, వింతలు, విడ్డూరాలు జరుగుతుంటాయి. మానవ మేధస్సుకు అంతుచిక్కని అరుదైన సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. వీటి గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. అస్సలు నమ్మబుద్ధి కాదు. ఈ ఘటన కూడా అలాంటిదే. ఇది ఓ అద్భుతం, ప్రపంచ వింత, కనీ వినీ ఎరుగని విడ్డూరం, మెడికల్ మార్వెల్ అనే చెప్పాలి. ఒక మహిళ రోజుల వ్యవధిలో రెండు సార్లు గర్భం దాల్చి వైద్య రంగానికే సవాలుగా మారింది. గర్భంతో ఉండగానే కడుపులో ఉన్న బిడ్డ పుట్టకండానే ఆమె మళ్లీ గర్భం దాల్చడం అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది.
ఒకే నెలలో రెండు సార్లు ప్రెగ్నన్సీ ...
అద్భుతాలు ఎప్పుడైనా, ఎక్కడైనా జరగొచ్చు. కొన్నిసార్లు మనం ఏమీ ఆశించలేము, కానీ అది ఊహించకుండానే జరుగుతుంది. సోషల్ మీడియాలో అలాంటి అద్భుతం ఒకటి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళ ముందుగా గర్భం దాల్చింది. ఈ వార్తతో ఆమె చాలా సంతోషంలో మునిగితేలింది. తనకు కవలలు జన్మిస్తారనుకున్న తల్లి, మళ్లీ గర్భం దాల్చిందని తెలిసి షాక్‌కు గురైంది. 30 ఏళ్ల 'సూపర్-ఫెర్టైల్' మహిళ ఒక నెల వ్యవధిలో రెండుసార్లు గర్భం దాల్చిందని వైద్యులు తెలిపారు. వృత్తి రీత్యా స్విమ్మింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన సోఫీ, 2020లో ప్రెగ్నెన్సీ స్కానింగ్ లో కవలలు అని తెలిసిన తర్వాత చాలా సంతోషించింది. అయితే సోఫీకి వచ్చిన గర్భం చాలా అరుదైనదని వైద్యులు తెలిపారు. ఒకరు పుట్టిన నాలుగు వారాలకు మరొకరు జన్మించారు. వారికి డార్సీ, హోలీ అని పేర్లు పెట్టారు.
కెన్నెడీ న్యూస్ ప్రకారం...
30 ఏళ్ల సోఫీకి గర్భధారణను సూపర్‌ఫెటేషన్ అంటారు. మొదటి గర్భం వచ్చిన కొద్ది రోజులకు అంటే వారాల వ్యవధిలోనే రెండవ గర్భం సంభవించింది. సోఫీ గర్భం దాల్చిన సమయంలో సిక్‌నెస్‌కు గురైంది . ఈ క్రమంలో ఆమె స్కాన్‌లను పరిశీలించిన తర్వాత వైద్యులు చాలా ఆశ్చర్యపోయారు. శిశువులు ఇద్దరూ వేర్వేరు పరిమాణాలలో ఉన్నట్లు నిర్దారించారు కాని కారణాన్ని గుర్తించలేకపోయారు.
32 వారాలకు ఒకరు.. 36 వారాలకు మరొకరు
సోఫీ అనే మహిళ ఆగస్ట్ 2020లో ప్రసవించింది, ఆ తర్వాత అది సూపర్‌ఫెటేషన్ అని వైద్యులు కనుగొన్నారు. 32 వారాలలో జన్మించిన డార్సీ సుమారు 4 పౌండ్లు 2oz (సుమారు 1.87 కిలోలు), ఆమె సోదరి హోలీ రెండు నిమిషాల తర్వాత 36 వారాలకు 6 పౌండ్లు 1oz (సుమారు 2.74 కిలోలు) బరువు కలిగి ఉన్నారు. గర్భంలో కూడా వారు విడి విడిగా ఉన్నారు. సోఫీ కుమార్తెలలో ఒకరు నెలలు నిండకుండానే జన్మించినందున బాక్స్ లో ఉంచాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. సాధారణంగా కవల పిల్లలను ఎవరో గుర్తించాలంటే చాలా కష్టం. కాని డార్సీ, హోలీల పోలికలు అసలు కలవవు. వారు ఒకే తల్లికి పుట్టిన వారిగా కూడా ఉండరు. అక్కా చెల్లెళ్లు అంటే అసలు నమ్మరు. హోలీకి అందగత్తె జుట్టు, పెద్ద అందమైన నీలి కళ్ళు ఉన్నాయి. డార్సీ జుట్టు ఒక మౌస్ బ్రౌన్ హెయిర్, ఆమె టామ్‌బాయ్ గా ఉంటుందని తల్లి సోఫీ తెలిపింది.
సూపర్‌ఫెటేషన్ అంటే?
సాధారణంగా స్త్రీలు గర్భం దాల్చగానే అండాశయం అండాలను విడుదల చేయడం నిలిపివేస్తుంది. కానీ, సూపర్‌ఫెటేషన్ అనే అత్యంత అరుదైన సందర్భంలో మాత్రం ఇందుకు విరుద్దంగా జరుగుతుంది. మహిళ గర్భంతో ఉన్నప్పటికీ అండం విడుదలవుతుంది. ఆ సమయంలో మహిళ శృంగారంలో పాల్గొంటే, పురుషుడి వీర్యం అండాన్ని చేరి గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. సూపర్‌ఫెటేషన్ అత్యంత అరుదుగా జరుగుతుంటుంది.
గతంలో కూడా...
కాగా.. ఇలాంటి అరుదైన మెడికల్ అద్భుతం 2016లోనూ జరిగింది. ఆస్ట్రేలియా మహిళలో కూడా ఇటువంటి సూపర్‌ఫెటేషన్ కేసు నమోదైంది. ఆమె కేవలం 10 రోజుల్లో రెండుసార్లు గర్భవతి అయ్యింది. 10 రోజుల వ్యవధిలో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. 2008 స్టడీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు 10వరకు ఉన్నాయి.
