సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తన అరంగేట్రం ఖరారైంది. ఈ చితాన్ని అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మించనున్నట్టు ఆదివారం అధికారికంగా ప్రకటించారు.
ఈ అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. తిరుమల కొండలను చూపిస్తూ ఆలయం, పరిసర పర్వతాల కారికేచర్‌తో ఎక్సయిటింగ్‌గా ఉంది పోస్టర్. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని, టైటిల్‌తో పాటు మిగతా వివరాలను త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.
‘రాజకుమారుడు’తో మహేష్ బాబును తెలుగు సినిమాకు పరిచయం చేసిన అశ్వినీ దత్ ఇప్పుడు ఘట్టమనేని మూడవ తరం స్టార్ జయ కృష్ణను హీరోగా పరిచయం చేయడం విశేషం.
