జలదిగ్బంధనంలో గ్రామాలు.. వాగుపై తాడు ఏర్పాటు చేసి..

జలదిగ్బంధనంలో గ్రామాలు.. వాగుపై తాడు ఏర్పాటు చేసి..
  • ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో తిప్పపురం పంచాయతీలోని గిరిజన గ్రామాలు
  • నాలుగు రోజులుగా జలదిగ్బంధనంలో ఐదు గిరిజన గ్రామాలు

ములుగు జిల్లా: గత వారం రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో వరద నీరు బీభత్సం సృష్టిస్తోంది. వాగులు, వంకలు పొంగి పారుతున్నాయి. వెంకటాపురం మండలం తిప్పపురం పంచాయితీ పరిధిలోని ఐదు గిరిజన గ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. నాలుగు రోజులుగా నిత్యావసర సరుకులు లేక ప్రజలు తిండికి ఇబ్బంది పడుతున్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు. విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో రెవెన్యూ సిబ్బంది వారికి నిత్యావసర వస్తువులు, కూరగాయాలు సిద్ధం చేశారు. అయితే ఆయా గ్రామాలకు పోయే దారిలో వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో సరుకుల పంపిణీకి ఆటంకం కలిగింది. వాగును దాటడం ప్రమాదకరంగా కనిపించడంతో అధికారులు వాగుపై పెద్ద తాడును సిద్ధం చేశారు. దీంతో గ్రామస్తులు తాడు సాయంతో వాగు దాటి వచ్చి కూరగాయలు, నిత్యావసర వస్తువులు తీసుకెళ్లారు.