మక్కలకు మద్దతు ధర ఇవ్వడం రైతుల విజయం: జీవన్ రెడ్డి

మక్కలకు మద్దతు ధర ఇవ్వడం రైతుల విజయం: జీవన్ రెడ్డి

మొక్కజొన్న రైతుల ఉద్యమం కారణంగానే ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అర్ధరాత్రి నుంచి అప్రజాస్వామికంగా పోలీసులు రైతులను అరెస్టు చేసినా బెదరకుండా కలెక్టరేట్  ముట్టడించారని తెలిపారు. 1850 రూపాయలకు మక్కలు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడం ఇది రైతుల విజయమన్నారు. ఇదే తరహాలో సన్న వడ్లను కూడా 2500 మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం సన్న వడ్లు పండించమని చెప్పడం వల్లే రైతులు ఆ పంట వేశారన్నారు. ఎకరాకు దొడ్డు వడ్లు పండిస్తే ముప్పై క్వింటాళ్లు పండుతాయి.. కానీ సన్నాలు 25 క్వింటాళ్ల మించిరావన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో ఈసారి రైతులు తీవ్రంగా నష్టపోయారన్న జీవన్ రెడ్డి…వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.