ఇంకెంత టైం కావాలి.?.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీం

ఇంకెంత టైం కావాలి.?.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీం

 తెలంగాణలో  పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను సుప్రీం కోర్టు మళ్లీ వాయిదా వేసింది.  ఫిబ్రవరి 10న విచారణ జరిపిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.

పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని జనవరి 15న బీఆర్ఎస్  సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది . ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,తెల్లం వెంకట్రావు,దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి ,కేపీ వివేకానంద పిటిషన్ వేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారంశ్రీనివాస్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి అరికెపూడి గాంధీపై కేటీఆర్,హరీశ్ రావు  రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ALSO READ | చెన్నూరులో ఘనంగా పెద్దపల్లి వంశీకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

ఫిబ్రవరి 10న ఉదయం (సోమవారం) ఈ రెండు పిటిషన్లపై   సుప్రీంకోర్టు విచారణ జరిపింది.  అసెంబ్లీ కార్యదర్శి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.  స్పీకర్ నుంచి  సమాచారం కోసం..మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 10 నెలలు పూర్తయింది..  ఇంకా  ఎంత టైం కావాలంటూ   ప్రశ్నించింది. ముకుల్ రోహత్గి విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.