
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీపావళి పండుగ పురస్కరించుకుని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గ్రీన్ క్రాకర్ల అమ్మకం, వాడకానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. 2025 అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు మొత్తం నాలుగు రోజుల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అయితే.. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా పేల్చాలని షరతు విధించింది. ఈ మేరకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో బాణసంచా నిషేధ నిబంధనలను సుప్రీంకోర్టు సడలించింది.
ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటంతో ఢిల్లీలో బాణాసంచా వినియోగంపై నిషేధం విధించారు. సంప్రదాయంలో భాగంగా దీపావళి పండుగ వేళ బాణాసంచా కాల్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు మొత్తం నాలుగు రోజులు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నాలుగు రోజుల్లో కూడా కేవలం రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యే బాణాసంచా పేల్చాలని కండిషన్ పెట్టింది. దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం పట్ల హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.