గ్రీన్ దీపావళి.. కాలుష్యం లేని గ్రీన్ క్రాకర్స్

గ్రీన్ దీపావళి.. కాలుష్యం లేని గ్రీన్ క్రాకర్స్

దీపావళి వచ్చిందంటే చాలు నాలుగైదు రోజులపాటు పటాకుల మోత వినిపిస్తుంటుంది. దాంతో పొల్యూటెడ్‌ సిటీల్లో పటాకులు వాతావరణాన్ని మరింత ప్రభావితం చేస్తున్నాయి. అందుకే కొన్నేండ్ల నుంచి ఢిల్లీలో పటాకులు కాల్చడంపై నిషేధం ఉంది. కానీ.. ఈసారి మాత్రం సుప్రీంకోర్టు గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్చుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. ఇంతకీ ఈ క్రాకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏముంది? మామూలు పటాకులకు, వీటికి తేడా ఏంటి? 

మన దేశంలో దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం ఎన్నో ఏండ్ల నుంచి సంప్రదాయంగా వస్తోంది. అయితే, ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరాల్లో పటాకుల వల్ల గాలి, శబ్ద కాలుష్యం పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సిటీల్లో సాధారణంగానే చలికాలంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. అలాంటి సిటీల్లో చలికాలం ప్రారంభంలోనే వచ్చే దీపావళి పండుగ కాలుష్యాన్ని మరింత పెంచుతుంది. 

ముఖ్యంగా ఢిల్లీ, ముంబై లాంటి ప్రధాన నగరాల్లో దీపావళి తర్వాత ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిటీ బాగా తగ్గుతుంది. అందుకే 2020లో పొల్యూషన్ ఎక్కువగా ఉండే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో పటాకులు కాల్చకూడదని నిషేధం విధించారు. అయితే.. అంతకుముందే కాలుష్యంపై పెరుగుతున్న ఆందోళనలను తగ్గించడానికి సైంటిస్ట్​లు  గ్రీన్ క్రాకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)తోపాటు మరికొన్ని ప్రముఖ సంస్థల సహకారంతో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్–నేషనల్ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ (సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ) 2018లో ఈ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. 

ఎలా తయారుచేస్తారు?

సాధారణ పటాకుల్లా కాకుండా వీటి తయారీలో తక్కువ విషపూరితమైన ముడి పదార్థాలను వాడతారు. సంప్రదాయ పటాకుల్లో బేరియం, నైట్రేట్, పొటాషియం క్లోరేట్, లెడ్, మెగ్నీషియం లాంటివి ఎక్కువగా వాడతారు. ఇవి ఎక్కువ పొగ, పీఎం(పర్టిక్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)2.5, పీఎం10 వంటి కాలుష్యకారకాలను విడుదల చేస్తాయి. ఈ సూక్ష్మకణాలు చాలా ప్రమాదకరమైనవి. అవి ఊపిరితిత్తులలోకి లోతుగా చొచ్చుకుపోయి తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయి. ముఖ్యంగా శ్వాసకోస వ్యాధులను కలిగిస్తాయి. అందుకే గ్రీన్ క్రాకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హానికారక కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చాలా తక్కువగా వాడతారు. అంతేకాకుండా నైట్రోజన్ బేస్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆక్సిడైజర్లు, తక్కువ స్మోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైండర్లు వాడడం వల్ల చాలా తక్కువ పొగను విడుదల చేస్తాయి. అయితే.. ఇవి పర్యావరణానికి ఏమాత్రం హాని చేయవు అనుకుంటే పొరపాటే. వీటిలో మామూలు పటాకులతో పోలిస్తే కాలుష్య కారకాలు దాదాపు 30 శాతం మాత్రమే తక్కువగా ఉంటాయి. అయితే.. సాధారణ పటాకులు160 డెసిబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుపైగా  శబ్దం చేస్తాయి. గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 125 డెసిబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి మించి శబ్దం చేయవు. పైగా వీటికి చిన్న షెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటాయి. కాబట్టి బూడిద కూడా తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. 

గుర్తించడం ఎలా ?

మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా ఫేక్ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్ముతున్నారు. కానీ.. సరైనవి గుర్తించి ఎంచుకోవాలి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ), పెట్రోలియం అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో) ఆమోదం పొందినవి మాత్రమే చట్టబద్ధమైవి. ప్రస్తుతం ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ఫార్ములా ప్రకారం తమిళనాడులోని ప్రఖ్యాత పటాకుల కేంద్రమైన శివకాశిలో వీటిని ఎక్కువగా తయారు చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి వీలుగా సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐకి సంబంధించిన ఆకుపచ్చ రంగు లోగోను డబ్బాలపై ముద్రిస్తున్నారు. దీని మీద ఒక క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే పటాకుల వివరాలు తెలుస్తాయి. 

గ్రీన్ క్రాకర్స్ రకాలు

గ్రీన్ క్రాకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తయారుచేసే పద్ధతి, తయారీలో వాడే పదార్థాలను బట్టి ప్రధానంగా మూడు రకాలుగా విభజించారు. ఇవి కూడా సాధారణ పటాకుల్లాగే ఫ్లవర్ పాట్స్, స్పార్క్లర్స్, మరూన్స్, బాంబుల్లాంటి రూపంలోనే అందుబాటులో ఉన్నాయి.

స్వాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిలీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): సల్ఫర్, పొటాషియం నైట్రేట్ ఉపయోగించకుండా వీటిని తయారుచేస్తారు. వీటిని కాల్చినప్పుడు నీటి ఆవిరి (వాపర్) విడుదల అవుతుంది. అది గాలిలో ధూళిని తగ్గిస్తుంది. 

స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సేఫ్​ థెర్మైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): పొటాషియం నైట్రేట్, సల్ఫర్ లేకుండా తయారుచేసే థర్మైట్ బేస్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాకర్ ఇది. పీఎం2.5తోపాటు గాలి కాలుష్యాన్ని 30 శాతం తగ్గిస్తుంది. దీని శబ్దం 110–125 డెసిబెల్స్ మాత్రమే ఉంటుంది. 

సఫల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(సేఫ్​ మినిమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్యూమినియం క్రాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): సాధారణ పటాకుల్లో అల్యూమినియం 34 శాతం వరకు వాడతారు. వీటిలో 29 శాతం మాత్రమే ఉంటుంది. బేరియం, ఆర్సెనిక్, మెగ్నీషియం లాంటి కాలుష్య కారకాలు ఉండవు. ఇది కాలుష్యాన్ని 20–30 శాతం తగ్గిస్తుంది.