
ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసుపై చంద్రబాబు తెచ్చుకున్న స్టే ను ధర్మాసనరం రద్దు చేసింది. 2005లో చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ జరపాలని నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా దీర్ఘకాలంగా ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు తెచ్చుకున్న స్టే రద్దయింది.
దీనితో కథ మళ్లీ మొదటికొచ్చింది. హైదరాబాద్ ఏసీబీ కోర్టు ఈ కేసుపై మళ్లీ విచారణ చేయనుంది. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని లక్ష్మీపార్వతికి సమన్లు జారీ అవడంతో ఆమె శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. కేసు స్టేటస్‌పై వచ్చేనెల 13న హైదరాబాద్ ఏసీబీ కోర్టు తిరిగి విచారణ చేపట్టనుంది.