అయోధ్యలో హైఅలర్ట్: పోలీసుల నిఘాలో పలు ప్రాంతాలు

అయోధ్యలో హైఅలర్ట్: పోలీసుల నిఘాలో పలు ప్రాంతాలు

ఈ నెల 17 వ తేదీ లోపు అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో UP  ఫైజాబాద్ పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. వివాదాస్పద ప్రాంతాలపై నిఘా పెంచడమే కాకుండా సోషల్ మీడియా పైనా కన్నేశారు. అందుకు 16 వందల ప్రాంతాల్లో ఆఫీసులు తెరిచి 16 వేల మందితో సోషల్ మీడియాను జల్లెడ పడుతున్నారు. వీరంతా అయోధ్య వ్యవహారంపై అభ్యంతరకర, రెచ్చగొట్టే కామెంట్స్ పెట్టే వారిని గుర్తించి పోలీసులకు సమాచారమిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. సుప్రీం  చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ నెల 17 న పదవీ విరమణ చేయడానికి ముందు అయోధ్య కేసుపై తుది తీర్పు వస్తుండడంతో సెక్యూరిటీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు… పోలీసులు.