ప్రధాని మోడీకి క్లీన్ చిట్ను సమర్ధించిన సుప్రీం కోర్టు

ప్రధాని మోడీకి క్లీన్ చిట్ను సమర్ధించిన సుప్రీం కోర్టు

2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం నరేంద్ర మోడీకి ఇచ్చిన క్లీన్ చీట్ ను సుప్రీం కోర్టు సమర్ధించింది. దీనిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ వేసిన పిటీషిన్ ను సుప్రీం తోసిపుచ్చింది. జస్టి ఖన్విల్కర్,జస్టిస్ దినేష్ మహేశ్వరి,జస్టిప్ సీటీ రవికుమార్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. సిట్ తీర్పును ఆమోదిస్తూ గుజరాత్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నామని..పిటీషన్ ను తిరస్కరిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

కాగా డిసెంబర్ 8, 2021న ఈ కేసులో విచారణ పూర్తైంది. అయితే అత్యున్నత న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ అల్లర్లలో కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జఫ్రీ మరణించారు. ఇక గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. మోడీతోపాటు ఇతర రాజకీయ నేతలపై 2006లో జాకియా జఫ్రీ ఈ కేసు వేశారు.