ఢిల్లీలో పాత వాహనాల ఓనర్లకు రిలీఫ్.. సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు..!

ఢిల్లీలో పాత వాహనాల ఓనర్లకు రిలీఫ్.. సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు..!

జూలై 1, 2025 నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 15 ఏళ్ల కంటే పాతవైన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్ల కంటే పాత డీజిల్ వెహికల్స్ కు ఇంధన విక్రయాలను నిలిపివేయాలంటూ నిబంధనలు తెచ్చింది ఢిల్లీ సర్కార్. నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా కాలం చెల్లిన వాహనాలను రోడ్లపైకి రాకుండా అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడి ప్రజలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. 

ఈ అంశంపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం ధర్మాసనం తదుపరి వాయిదా వరకు పాత వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈకేసు తదుపరి విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు 2018లో తాము తీసుకొచ్చిన నిబంధనల అమలుపై పునరాలోచన చేయాలని ఢిల్లీ సర్కార్ కోర్టును అభ్యర్థించింది. 

►ALSO READ | Retail Inflation: జూలైలో తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం.. ఆ ఖర్చులు మాత్రం పెరిగాయ్!

ప్రైవేట్ యాజమానుల వాహనాలు తక్కువగా ఉపయోగించవచ్చని దశాబ్దం తర్వాత వాటిని విక్రయించాలని.. అలాగే రవాణాకు ఉపయోగించే టాక్సీ వంటి కమర్షియల్ వాహనం సంవత్సరంలోనే 2 లక్షల కిలోమీటర్లు తిరిగినప్పటికీ వాటి జీవితకాలం ముగిసేంతవరకు రోడ్లపైనే తిరుగుతున్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది తుషార్ మెహతా ఎత్తిచూపారు. ఈ వివాదంపై మరోవైపు వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. ప్రభుత్వం తీసుకొస్తున్న గంపగుత్తు నిబంధనలు టెక్నికల్ గా అలాగే శాస్త్రీయంగా సరైనది కాదనే వాదనలు కూడా ఉన్నాయి. 

ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రధానంగా మధ్య తరగతి అలాగే అల్పాదాయ వర్గాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపనుంది. ఎందుకంటే వీరు తమ ఉపాధి కోసం ఎక్కువగా పాత వాహనాలను కొని ఉపయోగిస్తుంటారు. దీనిపై పూర్తి స్థాయి శాస్త్రీయమైన విధానంతో పాటు డేటా కూడా అవసరమని పర్యావరణ మంత్రి మజిందర్ సింగ్ సిర్సా చెప్పారు.