మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్కు సుప్రీం కోర్టులో ఊరట

మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్కు సుప్రీం కోర్టులో ఊరట

న్యూఢిల్లీ: డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిన కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సుప్రీం కోర్టు బుధవారం ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు సంస్థలకు ఖేద్కర్ సహకరించడం లేదని ఢిల్లీ హైకోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించడంతో పూజా ఖేద్కర్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ను విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న ఢిల్లీ హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘‘సహకరించకపోవడం అనడంలో అర్థం ఏంటి..? ఆమె మర్డర్ చేయలేదు. ఇదేమీ మాదక ద్రవ్యాల నేరం కాదు. ఆమె సహకరిస్తుంది.’’ అని జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. పూజా ఖేద్కర్ 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్. ఆమెపై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తన హోదాకు మించిన సౌలతులు కోరారని, తప్పుడు డిజెబిలిటీ, ఓబీసీ సర్టిఫికెట్లు సమర్పించి సివిల్స్కు ఎంపికయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఖేద్కర్ ట్రైనింగ్ను నిలిపివేస్తూ యూపీఎస్సీ ఆదేశాలు ఇచ్చింది. ఖేద్కర్పై నకిలీ డిజెబిలిటీ, ఓబీసీ సర్టిఫికెట్లు సమర్పించారనే ఆరోపణలున్నాయి.

ALSO READ | SBI బ్రాంచ్ మేనేజర్ వీడియో వైరల్.. దెబ్బకు చేతికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ !

పూజా ఖేద్కర్ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) గుర్తించింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులకు కంప్లయింట్ చేసింది. యూపీఎస్సీ ఫిర్యాదు మేరకు పూజా ఖేద్కర్​పై ఫోర్జరీ, చీటింగ్, ఐటీ యాక్ట్, డిజెబిలిటీ యాక్ట్ కింద  ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

‘‘పూజా ఖేద్కర్ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఆమె తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటో/సంతకం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, అడ్రస్ మార్చి.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్​ను క్లియర్ చేసేందుకు మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడింది. దీంతో ఆమెపై చర్యలు చేపట్టాం. పోలీసులకు ఫిర్యాదు చేశాం” అని యూపీఎస్సీ అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.