
- సెబీకి గడువు పెంచిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్–హిండెన్‌బర్గ్ రిపోర్టు అంశంలో దర్యాప్తు చేసి, నివేదిక ఇచ్చేందుకు సెబీకి సుప్రీం కోర్టు బుధవారం నాడు మరో 3 నెలల టైము ఇచ్చింది. సెబీ తమకు ఆరు నెలలు కావాలని కోరినప్పటికీ, సుప్రీం కోర్టు ఆగస్ట్ 14 వరకు మాత్రమే టైమ్ ఇచ్చింది. ఇప్పటికే 5 నెలల టైము ఇచ్చినందున, ఇంతకంటే ఎక్కువ టైము ఇవ్వలేమని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఈ కేసు విచారణ సోమవారం వాయిదా పడిన విషయం తెలిసిందే. దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో చెబుతూ ఒక స్టేటస్ రిపోర్టు సబ్మిట్ చేయాల్సిందిగా సెబీని చీఫ్ జస్టిస్ డీ వై చంద్రచూడ్ నాయకత్వంలోని బెంచ్ ఆదేశించింది. జస్టిస్ పీ ఎస్ నరసింహ, జస్టిస్ జే బీ పర్దివాలు కూడా ఈ బెంచ్‌లో ఉన్నారు. తమకు సబ్మిట్ చేసిన జస్టిస్ ఏ ఎం సప్రే కమిటీ రిపోర్టును పార్టీలకు కూడా అందజేయాల్సిందిగా బెంచ్ సెబీకి ఉత్తర్వులు జారీ చేసింది.