
- ఎఫ్ఆర్వో హత్య కేసు నిందితుల బెయిల్ పై మీ వైఖరేంది?
- రాష్ట్ర సర్కార్కు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీని వాసరావు మర్డర్ కేసుకు సంబంధించి తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులకు బెయి ల్ మంజూరుపై వైఖరి తెలపాలని ఉత్తర్వులో పేర్కొంది. గతేడాది నవంబర్లో పోకలగూడెం ఫ్లాంటేషన్లో పశువులు మేపుతున్నారన్న సమాచారంతో అడ్డుకునేందుకు వెళ్లిన ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రావును గుత్తి కోయకు చెందిన మడకం తులా, పొడియం నంగాలు వేట కొడ వళ్లతో హత్య చేశారు. ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సోమవారం జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ కేవీ విశ్వనాధన్ లతో కూడిన బెంచ్ విచారించింది. ఇది డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారి మర్డర్ కదా? అని ప్రశ్నించింది. ఇందుకు పిటిషన్ తరఫు లాయర్ శ్రవణ్ బదులిస్తూ.. హత్య జరిగిన నాటి నుంచి నిందితులు జైళ్లోనే ఉన్నారని చెప్పారు.