ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌ తెలంగాణ హైకోర్టుకు బదిలీ

ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌ తెలంగాణ హైకోర్టుకు బదిలీ

ఏపీ మాజీ మంత్రి వివేకా హత్యకేసులో కీలక నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బెయిల్ రద్దు పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. గతంలో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ విషయంలో మెరిట్స్ ను పరిగణలోకి తీసుకోలేదని..ఇపుడు మెరిట్స్ ఆధారంగా బెయిల్ రద్దుపై  నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ఎర్రగంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఇవాళ విచారణ సందర్భంగా పిటిషన్ ను సుప్రీంకోర్ట్ తెలంగాణ హైకోర్ట్ కు బదిలీ చేసింది.   వివేకా హత్య కేసు విచారణను ఇప్పటికే సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. దీంతో  తెలంగాణ హైకోర్ట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2019 మార్చి 19న వివేకా హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఎర్రగంగిరెడ్డి కీలక నిందితుడు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు.