
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎంఆర్ షాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయనకు సడెన్ స్ట్రోక్ రావడంతో ట్రీట్మెంట్ కోసం ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీకి తరలించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని. ఎవరూ ఆందోళన చెందవద్దని జస్టిస్ షా చిన్న వీడియో రిలీజ్ చేశారు.
"దేవుడి దయతో ఇప్పుడు బాగానే ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంది. ఢిల్లీకి చేరుకుంటున్నాను. ఎవరూ ఆందోళన చెందకండి. దేవుడి దర్శనం కోసం ఇక్కడకు వచ్చాను. దేవుడి ఆశీస్సులతో తిరిగి వెళ్తున్నారు. రేపు లేదా ఎల్లుండి కల్లా అంతా బాగైపోతుంది. మీరు నన్ను చూసేందుకు రావచ్చు." అని జస్టిస్ షా విడుదల చేసిన వీడియోలో చెప్పారు.
I am stable. There is nothing to worry. I will be reaching Delhi soon. By day after tomorrow, I will be better: Justice MR Shah
— ANI (@ANI) June 16, 2022
(Source: Justice Shah's office) pic.twitter.com/zpH6xTInhc
సుప్రీంకోర్టుతో పాటు హోం శాఖ అధికారులు సమన్వయంతో జస్టిస్ షాను ఎయిర్ అంబులెన్స్ లో ఢిల్లీకి తరలించారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎంఆర్ షాతో పాటు హోంశాఖ అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నారు.