ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి : తల్లమళ్ల హస్సేన్

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి : తల్లమళ్ల హస్సేన్
  •     మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమళ్ల హస్సేన్

సికింద్రాబాద్, వెలుగు : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అన్నిరాజకీయ పార్టీలు గౌరవించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమళ్ల హస్సేన్ సూచించారు. పెరిగిన జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 20 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 7 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కోరారు.

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం నిర్వహించగా.. హస్సేన్ మాట్లాడుతూ హైదరాబాద్​లో మాల ఉప కులాలకు మాల సంక్షేమ భవన్ నిర్మాణానికి 5 ఎకరాల భూమి, రూ.10 కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం పథకంలో భాగంగా ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి రూ.12 లక్షలను వెంటనే పంపిణీ చేయాలని పేర్కొన్నారు.  

సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎడ్ల నాగరాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి మంచాల వెంకటస్వామి, రాష్ట్ర కార్యదర్శి మన్నె కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు కామర్ల జానయ్య, దాసరి దేవయ్య, బాబురావు, వివిధ జిల్లాల అధ్యక్షులు అనంపల్లి ఎల్లన్న, బోయల అఖిల్, మన్నె హరి, సమ్మయ్య, కోలుకుపల్లి నాగార్జున, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.