పాలల్లో నీళ్లు కలిపిన వ్యాపారికి 6 నెలలు జైలు శిక్ష

పాలల్లో నీళ్లు కలిపిన వ్యాపారికి 6 నెలలు జైలు శిక్ష

24 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి ఆహార కల్తీ నిరోధక చట్టానికి విరుద్దంగా ప్రవర్తించాడని సుప్రిం కోర్ట్ ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇంతకీ అతను చేసిన తప్పేంటో తెలుసా..? నిందితుడు అమ్మిన పాలల్లో కొవ్వు పదార్ధం 7.7శాతం ఉండటమే. 1995 రాజ్ కుమార్  అమ్మిన పాలు పలచగా ఉన్నాయనే అనుమానంతో ట్రయల్ కోర్టు వాటిని ల్యాబ్ లో పరీక్షలు చేయించింది. ఆ పరీక్షలో రాజ్ కుమార్ అమ్మిన పాలు చట్టానికి విరుద్దంగా ఉన్నాయని తేలింది.  పాలల్లో కొవ్వుకానీ, ఘనపదార్ధం కాని 8శాతం ఉండాలి. కానీ రాజ్ కుమార్ పాలల్లో 7.7 శాతం కొవ్వు ఉన్నట్లు గుర్తించిన సంబంధిత అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు 24ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసుపై  సుప్రీం కోర్ట్ జస్టిస్ దీపక్ గుప్త, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పిచ్చింది. పాల వ్యాపారికి 6 నెలలు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పిచ్చింది. పాలపలచగా ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం తెలిపింది. కాగా బాధితుడు తరుపున్యాయవాది 24 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కాబట్టి తన క్లయింట్ రాజ్ కుమార్ పై కనికరం చూపించాలని కోరగా, అందుకు ధర్మాసనం వ్యతిరేకించింది.