యూట్యూబ్ లైవ్ లో సుప్రీంకోర్టు కేసుల విచారణ

యూట్యూబ్  లైవ్ లో సుప్రీంకోర్టు కేసుల విచారణ

సుప్రీంకోర్టులో విచారణల లైవ్ స్ట్రీమింగ్ మొదలైంది. రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను యూట్యూబ్ లైవ్ లో చూసేందుకు సుప్రీంకోర్టు వీలు కల్పించింది. త్వరలోనే లైవ్ స్ట్రీమింగ్ కోసం సొంత ప్లాట్ ఫామ్ ను అందుబాటులోకి తీసుకొస్తామంది. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసుల్ని మాత్రమే యూట్యూబ్ లో చూసే వీలు కల్పించింది. 

కేసుల విచారణ లైవ్ స్ట్రీమింగ్ చేయాలని....సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలో నిన్నజరిగిన ఫుల్ కోర్టు భేటీలో నిర్ణయించారు. లైవ్ ఇచ్చేందుకు జడ్జిలందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. EWS కోటా, ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రం, శివసేన వివాదం, ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ చెల్లుబాటుపై మూడు వేర్వేరు ధర్మాసనాల వాదనలు వింటున్నాయి.