సాయంత్రంలోగా లొంగిపోవాలని బిల్కిస్​ బానో దోషులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

సాయంత్రంలోగా లొంగిపోవాలని బిల్కిస్​ బానో దోషులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: లొంగిపోవడానికి మరింత టైమ్​ కావాలంటూ బిల్కిస్‌‌ బానో కేసు దోషులు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వాటికి విచారణార్హతలేదని జస్టిస్​ బీవీ నాగరత్న, జస్టిస్ ​ఉజ్జల్ భుయాన్‌‌లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. ఆదివారం నాటికి వారంతా జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిందేనని ఆదేశించింది.

2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌‌లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో బిల్కిస్‌‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఐదు నెలల గర్భిణి బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది దోషులు15 ఏండ్లు జైలులో గడిపారు. గుజరాత్​ ప్రభుత్వం వీరికి రెమిషన్ ప్రసాదించడంతో 2022 ఆగస్టు15న జైలు నుంచి విడుదలయ్యారు.