తొలగించిన 65 లక్షల ఓటర్ల లిస్టు ఇవ్వండి:ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశం

తొలగించిన 65 లక్షల ఓటర్ల లిస్టు ఇవ్వండి:ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశం

బీహార్ ఓటర్ జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై కీలక నిర్ణయం ప్రకటించింది సుప్రీంకోర్టు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో తొలగించిన 65 లక్షల మంది  ఓటర్ల లిస్టును ప్రజలకు ముందుంచాలని ఆదేశించింది.. అది కూడా బీహార్ ఎన్నికలకు ముందే ప్రకటించాలని కోరింది.

ALSO READ : చరిత్రలో మొదటిసారిగా ఒక దేశం మొత్తం ఖాళీ చేస్తున్నారు

ఎన్నికలు జరగనున్న బీహార్ లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై గురువారం(ఆగస్టు14) విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం బాధిత ఓటర్లకు వారి తొలగింపు గురించి తెలుసుకునేలా తొలగించిన ఓటరల్ లిస్టును ప్రకటించాలని ఆదేశించింది. వార్తాపత్రికలు, టెలివిజన్ ,సోషల్ మీడియా ద్వారా తొలగింపుల విస్తృత ప్రచారం కల్పించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ ప్రక్రియను వచ్చే మంగళవారం(ఆగస్టు 19) నాటికి ఈ దశలను పూర్తి చేయాలని కమిషన్‌ను కోరింది.

SRI పారదర్శకతపై పెరుగుతున్న ఆందోళనలు, బీహార్ ఎన్నికలపై SIR ప్రభావం చూపుతుందన్న ఆరోపణల మధ్య సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలిచ్చింది. ఓటింగ్ కు ముందు ప్రజలకు అందుబాటులో ఉండేలా పూర్తి జాబితాను తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం కోరింది. 

సవరణ ప్రక్రియ న్యాయబద్ధత, ఖచ్చితత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంఘాలు ,ప్రభావిత వ్యక్తులు తొలగింపులను పరిశీలించేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.

బాధిత ఓటర్లకు వారి తొలగింపు గురించి తెలుసుకునేలా  వార్తాపత్రికలు, టెలివిజన్,సోషల్ మీడియా ద్వారా తొలగింపుల విస్తృత ప్రచారం కల్పించాలని జస్టిస్ సూర్యకాంత్ ,జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈసీని ఆదేశించింది.

ఓటరు లిస్టులో పేరు తొలగించబడిన వ్యక్తులు తమ అభ్యంతరాలను తెలపవచ్చని కోర్టు సూచించింది. ప్రూఫ్ లుగా ఆధార్ కార్డులను కూడా చూపించవచ్చని తెలిపింది. వచ్చే మంగళవారం(ఆగస్టు 19) నాటికి ఈ దశలను పూర్తి చేయాలని కమిషన్‌ను కోరింది.

బీహార్ SIRకి సవాళ్లపై విచారణ

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దాఖలు చేసిన దానితో సహా బీహార్‌లో SIR తీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించింది అత్యున్నత న్యాయస్థానం. విచారణ సమయంలో తొలగించబడిన ఓటర్ల జాబితాను ప్రకటించడంతో పాటు తొలగింపుకు గల కారణాలను బహిరంగపరచాలని ADR  కోర్టును కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 22 కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.