పిల్లలు, కేసులు లేని వాళ్లను విడుదల చేయండి : FIRలపై బలవంతపు చర్యలు వద్దు

పిల్లలు, కేసులు లేని వాళ్లను విడుదల చేయండి : FIRలపై బలవంతపు చర్యలు వద్దు

నీట్ పేపర్ లీక్ పై దేశ వ్యాప్తంగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు, ఆందోళనలు, ధర్నాలతో స్టూడెంట్స్ పై నమోదైన కేసులపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. స్టూడెంట్స్ అరెస్ట్, జైలు, కేసులపై దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కేసులపై దాఖలైన పిటీషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. 

అన్ని పిటీషన్ల కలిపి విచారణ చేసిన సుప్రీంకోర్టు.. 18 ఏళ్ల లోపు పిల్లలను వెంటనే విడుదల చేయాలని స్పష్టం అయిన ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా కేసులు లేని.. ఎలాంటి క్రైం రికార్డ్ లేని వాళ్లను సైతం వెంటనే విడుదల చేయాలని.. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. 

నేర చరిత్ర ఉన్న వాళ్లకు ఇది వర్తించదని.. అలాంటి వాళ్లకు రక్షణ కల్పించలేం అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆధ్వర్యంలో బెంచ్. 

కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన నిరసనలు, ఆందోళనలపై నమోదైన FIRలపై బలవంతపు చర్యలు వద్దని.. ఆచితూచి వ్యవహరించాలని హోంశాఖలను ఆదేశించింది సుప్రీంకోర్టు. విద్యార్థులపై నమోదైన FIRలపై బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. 

నిరసనలు, ఆందోళనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ రికార్డింగ్ వీడియోలు, బాడీ క్యామ్ కెమెరా ఫుటేజ్, వైర్ సెల్ కమ్యూనికేషన్ రికార్డులు అన్నింటిని జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించింది కోర్టు. 

ALSO READ : విద్యార్థులను కొట్టినోళ్లను వదిలిపెట్టం

జంతర్ మంతర్ తోపాటు కొన్ని చోట్ల జరిగిన లాఠీఛార్జ్, పెల్లెట్ గన్స్ ప్రయోగం, లాయర్లపై దాడులు, సాధారణ దుస్తుల్లో స్టూడెంట్స్ పై దాడులు చేశారంటూ వస్తున్న వార్తలపైనా సుప్రీంకోర్టు స్పందించింది. ఈ ఘటనలపై పాదర్శకంగా విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో SIT.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది కోర్టు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతోపాటు అసోం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం కోరింది సుప్రీంకోర్టు. 

ఈ నిరసనల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారని.. వాళ్ల కుటుంబాలకు అండగా ఉండాలని ప్రభుత్వాలను కోరింది. వారికి కూడా మద్దతు ఉంటుందని.. ఆ అంశాలను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.