సర్వీస్ బ్రేక్.. పింఛన్ల ప్రయోజనాలకు అడ్డంకి కాదు

సర్వీస్ బ్రేక్.. పింఛన్ల ప్రయోజనాలకు అడ్డంకి కాదు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ బ్రేక్  అనేది పింఛన్ ప్రయోజనాలకు అడ్డంకి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

అయితే పనిచేయని కాలానికి నో వర్క్, నో పే సూత్రం వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఈ విషయంలో దాఖలైన పిటిషన్ ను డిస్మిస్    చేసింది. పనిచేయని కాలానికి జీతం చెల్లించే అంశంపై విభజన చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదని తెలిపింది.

 అందువల్ల నో వర్క్, నో పే వర్తిస్తుందని స్పష్టం చేసింది. పరిపాలనా జాప్యం వల్ల వారి పింఛన్‌ ప్రయోజనాలకు నష్టం వాటిల్లడం సరికాదని పేర్కొంది.